calender_icon.png 8 November, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

08-11-2025 08:06:14 PM

రాజాపూర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చిత్రపటం ఎదురుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, నజీర్ బేగ్, సత్యం, రమేష్, విజయ్, నర్సింలు, చెన్నయ్య, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.