calender_icon.png 10 November, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ రెడ్డికి నాపై ఎందుకు కక్ష..?

31-07-2024 01:26:14 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సబితా ఇంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వచ్చారన్నారు. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి, నా ఇంటి మీద వాలితే కాల్చి చంపేస్తామనన్నాడు. రేవంత్ పార్టీలోకి వస్తే తాను సంతోషంగా ఆహ్వానించానని, కాంగ్రెస్ పార్టీకి ఆశా కిరణం అవుతానని చెప్పానని గుర్తుచేశారు. సీఎం అవుతావని కూడా చెప్పానన్నారు. మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డిని అశీర్వదించానని సబితా వెల్లడించారు. కానీ రేవంత్ రెడ్డి తనను ఎందుకు టార్గెట్ చేశారన్నారు.  రేవంత్ రెడ్డికి తనపై ఎందుకు కక్ష్య? అని ప్రశ్నించారు.