7 April, 2026 | 11:29 PM

హన్మంతుని వాగులో ఇసుక తోడేళ్లు

07-02-2026 12:00 AM
  1. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అక్రమార్కులు

జాతర తలపిస్తోన్న ఇసుక ట్రాక్టర్లు 

అధికార పార్టీ అండదండలతో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా

రెండు టాక్టర్లలను పట్టుకుని వదలేసిన రెవెన్యూ సిబ్బందికి మెమోలు జారీ చేసిన తహశీల్దార్

కన్నాయిగూడెం,ఫిబ్రవరి6(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామ పరిధిలో ఉన్న హనుమంతుని వాగులో అక్రమార్కు లు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలు తరచూ వింటున్నాము హనుమంత ని వాగులో రోజుకు 30నుంచి 40టాక్టర్లు ఇసుకను అక్రమంగా తోడేస్తున్నట్లు విమర్శ లు వస్తున్నాయి.వాగు నుంచి ఇందిరమ్మ ఇ ళ్ల నిర్మాణం పేరుతో ఇతరులకు అధిక ధరలకు అక్రమంగా విక్రయిస్తూ ఇసుక దందా నిర్వహిస్తున్న దళారులు సొమ్ము చేసుకుంటున్నట్లు విమర్శలు గట్టిగానే వస్తున్నాయి.

అక్రమ ఇసుక దందా వ్యవహారం రోజురోజుకు పెరుగుతూ పోతుంది. ప్రభుత్వం ఇంది రమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక ఫ్రీగా ఇ వ్వాలని నిర్ణయిస్తే ముగ్గురు/నాలుగురు ట్రాక్టర్ల యజమానులు సిండికేట్ గా మారి ఇసుక అక్రమ రవాణా దందాకు తెరలేపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇం దిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక పంపిణీకి ముందు,వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ఎవరైనా ఫిర్యాదు చేయగానే రెవిన్యూ యంత్రాంగం అందరూ కలిసి ఎక్కడెక్కడ డంపింగ్లు ఉన్నాయో వాటిని సీజ్ చే యడం జరిగేది.

అయితే ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి కన్నాయిగూడెం మండలంలో అధికార పార్టీ నాయకుల అండదండ లతో ఇసుక రవాణా అధికంగా జరుగుతున్న రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్య వహరిస్తున్నారని ఆరోపణలు గట్టిగానే వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇసుక రవాణా చేసుకోవాలంటే అధికారుల అనుమతి ఉండాలి అని చెబుతున్నారు. కొ న్ని రోజుల నుంచి కన్నాయిగూడెం మండలంలో ఎవరి ఆధీనంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా నడుస్తున్నదని చర్చ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు,గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.

ప్రభుత్వ సొమ్ము దళారుల పాలు

ఇసుక తరలింపు పై అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని, ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందిర మ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక ఇస్తున్నప్పటికీ,ఇతర ప్రభుత్వ ప్రైవేటు,నిర్మాణాలకు ఇసుక ఎక్కడి నుంచి వస్తున్నదనే ప్రశ్నలకు సమాధానం లేదు. ఇతర నిర్మాణాలకు కచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన రుసుము చెల్లించి వాగు నుండి ఇసుక తరలించాల్సి ఉంటుందని, అయితే ఎక్కడ కూడా అలాం టి చర్యలు తీసుకున్న దాఖలను లేవని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందని విమర్శలు వస్తున్నాయి.

 నెంబర్ ప్లేట్లు లేనీ ట్రాక్టర్లలో తరలిస్తున్న ఇసుక అక్రమార్కులు

నెంబర్లు ప్లేట్లు లేని వాహనాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఇసుక వ్యాపారం లాభసాటిగా మారడంతో పగలు రాత్రి తేడా లేకుండా బుట్టాయిగూడెం గ్రామ సరిహద్దు దాటుకొని రోజుకు పెద్ద సంఖ్యలో ఇసుక టాక్టర్లు వెళుతున్నాయి. ఇసుకను తరలిస్తున్న టాక్టర్లను ఎక్కువగా మైనర్లే నడుపుతున్నారు. ఇసుక టాక్టర్లు మైనర్ డ్రైవర్లు అతివే గంగా నడపడం వల్ల ఇతర వాహనదారులు పలు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఓవర్ స్పీడ్ తో వస్తున్న ఇసుక టాక్టర్లతో ఎప్పుడు ఏ ప్రమా దం జరుగుతుందని. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టాక్టర్లను డ్రైవింగ్ చేస్తు న్న మైనర్లను పోలీసులు పలుమార్లు హెచ్చరించారు అయిన అదే రీతిలో పోతున్నారు అక్రమ రవాణా జరుగుతున్న రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు రోడ్లపై తిరుగుతున్నాయి

దళారులు నిర్దేశించిందే ధర

ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక కూపన్లు ట్రాక్టర్ల యజమా నులకు ఇవ్వాలని కేవలం రవాణా చార్జీ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ట్రాక్టర్ రవాణా చార్జీలను ఎక్కడ కూడా అధికారులు నిర్ణయించలేదు. దీనితో ట్రాక్టర్ల యజమానులు నిర్ణయించిన ధరకే నిరుపేదలు ఇసుక దిగుమతి చేసుకోవాల్సి వస్తోం ది. అధికారులు స్పందించి ఇసుక కూపన్లు ఇస్తే ఎక్కడి నుంచి ఎక్కడికు ఇసుక తరలిస్తున్నారు తెలుసుకొని అందుకు తగ్గట్టుగా ధర కూడా నిర్ణయించి అంతే ధర లబ్ధిదారుల నుండి ట్రాక్టర్ల యజమానులు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నిబంధనల ప్రకారమే ఇసుక కేటాయింపు

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభు త్వం నిర్దేశించిన ప్రకారమే ట్రాక్టర్లకు ఇసుక కూపన్లు ఇస్తున్నాము. ఇసుక అక్రమ రవాణా విషయంలో ఫిర్యాదు రాగానే చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలు వాహనాలను స్వాధీనం చేసు కుని జరిమానా కూడా విధించాం బుధవారం రెండు ఇసుక టాక్టర్లను పట్టుకుని ఎలాంటి జరిమానా విధించకుండా వదిలేసిన మా ఇబ్బంది ఆర్,ఐకి,బుట్టాయి గూడెం జీపీఓకి మెమోలు జారీ చేశా ము ఇసుక అక్రమ రవాణా జరిగినట్లు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.

కన్నాయిగూడెం తహశీల్దార్ సయ్యద్ సర్వర్