సాయంత్రం ఆరోగ్య ఉత్సవాలకు సీఎం శ్రీకారం
02-12-2024 12:00 PM
హైదరాబాద్: ఆరోగ్య ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం శ్రీకారం చుట్టనున్నారు. ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ఎండీఏ గ్రాండ్స్ లో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 28 పారామెడికల్, 16 నర్సింగ్ కాలేజీలు, 33 ట్రాన్స్ జెండర్ క్లినిక్ లను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. 108 కోసం 136, 102 కోసం 77 అంబులెన్స్ లకు సీఎం రేవంత్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు, 24 మంది ఫుడ్ ఇన్ స్పెక్టర్లకు ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందించనున్నారు.




