calender_icon.png 14 January, 2026 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పచ్చి అబద్దాలు చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

14-01-2026 02:18:27 AM

  1. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ 
  2. 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాంతి ర్యాలీ

సికింద్రాబాద్ జనవరి 13 (విజయ క్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పుతూ ప్రజలను మోసం చేస్తు న్నారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో సనత్ నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు చెందిన కార్పొరేటర్ లు,మాజీ కార్పొరేటర్ లు, మాజీ బోర్డు సభ్యులు,ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ జిహెచ్‌ఎంసి లోనే ఉందని, మల్కాజిగిరిలో కలపలేదని పచ్చి అబద్దాలు చెప్పారని అన్నారు.

సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నూతనంగా ఏర్పడ్డ ప్రకాష్ నగర్, మోండా డివిజన్ లను మల్కాజిగిరి జోన్ పరిధిలోని బోయిన్‌పల్లి సర్కిల్‌లో కలిపిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అదేవిధంగా సికింద్రాబాద్ ప్రాంతంలోని బేగంపేట, మహంకాళి, గోపాలపురం, కార్ఖానా, బోయిన్ పల్లి, తదితర పలు పోలీస్ స్టేషన్‌లను మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి కలిపారని, ఇది సికింద్రాబాద్‌ను మల్కాజిగిరిలో కలిపినట్లు కాదా అని ప్రశ్నించారు.

ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి నిర్వహించనున్న శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని అందుకు ప్రజలు, పలు అనుబంధ సంఘాలు తమ మద్దతు తెలపయన్నారు. ఈ సమావేశంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్‌లు సామల హేమ, శైలజ, ప్రసన్న, సునీత, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, మాజీ కార్పొ రేటర్ నామన శేషుకుమారి, డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, హన్మంతరావు, శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, సభ్యులు పాండు యాదవ్, అనిత ప్రభాకర్,నళిని కిరణ్, లోకనాధం, పలువురు నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.