calender_icon.png 23 September, 2025 | 3:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో క్రీడా శాఖలోని ఖాళీలను భర్తీ చేయాలి..

23-09-2025 01:08:22 PM

రాష్ట్ర మంత్రిని జిల్లా యూత్ కాంగ్రెస్ నేత వినతి..

అదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలోని క్రీడల శాఖలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధి, మత్స శాఖ, క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి కోరారు. ఈ మేరకు హైదరాబాదులో మంగళవారం మంత్రిని కలిసి పలు సమస్యలను విన్నవించారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోని స్పోర్ట్స్ స్కూల్ నుఇంటర్మీడియట్ వరకు అప్ గ్రేడ్ చేయాలని కొరారు. జిల్లాలో స్టేడియం ఉన్నా సిబ్బంది లేక ఎందరో మంది క్రీడాకారులు ప్రతిభ ఉన్న ముందుకు వెళ్ళలేకపోతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆదివాసీల జిల్లాగా పేరొందిన మా జిల్లాలో ఆటల పోటీల్లో ముందుండే యువకులు ఉన్న కోచులు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఆయనకు తెలియజేశారు. అదేవిధంగా క్రికెట్ స్టేడియం నియమించాలని విజ్ఞప్తి చేశారు.