23-09-2025 01:03:15 PM
చిట్యాల (విజయక్రాంతి): భారీ వర్షం కారణంగా నష్టపోయిన రైతును ప్రభుత్వమే తమను ఆదుకోవాలని మంగళవారం కోరారు. చిట్యాల మండలం నేరడ గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వల్లేం రాంరెడ్డి అనే రైతుకి చెందిన మూడు ఎకరాల వ్యవసాయ భూమిలో వేసిన మునగ, జామ తోటలు పూర్తిగా నేలకొరిగాయి. 3 నెలలు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి వర్షం కారణంగా తోటలోని అన్ని చెట్లు నెలకొరగడంతో కన్నీటి పర్యంతం అయిన రైతు ఆవేదన వక్తం చేశాడు. సుమారు 4 లక్షలు వరకు నష్టం జరిగిందని వాపోయిన బాధిత రైతు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు.