calender_icon.png 17 May, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకు అండగా నిలబడతా.. ఆర్థికంగా ఎదగండి

17-05-2025 02:40:57 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో వీ హబ్-ఉమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వీ హబ్-ఉమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... మహిళా శక్తిని ప్రపంచానికి ఇందిరాగాంధీ చూపించారని, మహిళలే దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రం ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేరుకోవాలంటే కోటి మంది మహిళలు కోటీశ్వర్లు కావాలని తెలిపారు.

వారికోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణసౌకర్యం తీసుకొచ్చామని, ఆడబిడ్డలకు రూ.500లకే సిలిండర్ అందిస్తున్నామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణను మహిళలకే అప్పగించామని, మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈనెల 21న ఇందిరా మహిళ స్టాళ్లను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిస్తున్న నేపథ్యంలో సెర్ప్ సభ్యుల సంఖ్యను కోటి మందికి చేర్చాలని సూచించారు. మహిళలకు అండగా నిలబడతా.. ఆర్థికంగా ఎదగండి అని సీఎం చెప్పారు. కార్పొరేట్ కంపెనీలకు డబ్బులు ఇస్తే తీసుకొని దేశం విడిచి పారిపోతున్నారని, మహిళలకు ఇచ్చే ప్రతి రూపాయి వడ్డీతో సహా చెల్లిస్తున్నారని, దీంతో ఆడబిడ్డలను ప్రోత్సహించాలనేదే మా ప్రభుత్వం లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.