calender_icon.png 18 May, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎస్‌ఎల్‌వీ సీ-61 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ స్టార్ట్

17-05-2025 06:46:13 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) 101వ మిషన్ కు రంగం సిద్ధం చేసింది. పీఎస్‌ఎల్‌వీ సీ-61 రాకెట్ ప్రయోగానికి శనివారం ఉదయం 7.59 గంటలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇస్రో మే 18వ తేదీన ఉదయం 6.59 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-61 వాహక నౌకను నింగిలోకి దూసుకెళ్లనుంది.

అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఈవోఎస్-09 ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపనుంది. దేశ భద్రతను బలోపేతం, అటవీ పర్యవేక్ష, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక రంగాల్లో ఈవోఎస్-09 సేవలు అందించనుంది. ఈ ప్రయోగం ద్వారా 1696.24 కేజీల బరువు కలిగిన ఈవోఎస్-09 ఉపగ్రహాన్ని 17 నిమిషాల తర్వాత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది ఐదేళ్లపాటు సేవలందించనుంది. ఈవోఎస్ ఉపగ్రహాల సిరీస్ లో ఇది తొమ్మిదో ఉపగ్రహం.