calender_icon.png 31 January, 2026 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రిలో ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

31-01-2026 01:40:22 PM

  1. బంగారు, వెండి డాలర్లు అదృశ్యం
  2. పలువురిని సస్పెండ్ చేసిన ఎ. ఇ. 
  3. ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ
  4. జూనియర్ అసిస్టెంట్,రికార్డు అసిస్టెంట్ సస్పెండ్
  5. సూపరిండెంట్లకు చార్జి మెమొలు
  6. సహాయ కార్యనిర్వహణాధికారికి షోకాస్ నోటీసులు జారీ చేసిన ఆలయ ఈవో.

ఆలేరు,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఉన్న బంగారు, వెండి డాలర్లు అదృశ్యమైన ఘటనలో పలువురిని సస్పెండ్ చేసిన ఎ. ఇ, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట దేవస్థానంలో చోటుచేసుకుంది, భక్తులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన బంగారం, వెండి డాలర్లు అధిక మొత్తంలో కనిపించకపోవడం, ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసినదే.

ఇట్టి విషయంపై దేవాలయ ఈవో భవాని శంకర్ డాలర్ల అదృశ్యంపై స్పందిస్తూ,  విచారణకు ఆదేశించి, శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులలో జారీ చేశారు, ప్రచార శాఖలలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించేందుకు జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్లు  ఇద్దరినీ విధులనుండి సస్పెండ్ చేశారు. ప్రచారశాఖలో పర్యవేక్షణ లోపం వల్ల విధులు పట్ల నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్లుకు చార్జి మెమొలు జారీ, ఆలయ అధికారులు సహాయ కార్య నిర్వహణ అధికారికి షోకాస్ నోటిలో జారీ చేశారు విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ప్రతి అధికారికి కఠిన చర్యలు ఉంటాయని ఉద్యోగులను హెచ్చరించారు.