31-01-2026 01:17:12 PM
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్‌నగర్,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో తన సాహిత్యం ద్వారా యావత్తు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన గొప్ప నేత గద్దర్ చరిత్ర లో నిలిచిప్తారని షాద్ నగర్ ఎమ్మెల్యే విర్ల పల్లి శంకర్ అన్నారు. శనివారం షాద్ నగర్ లో ఎంపీడీవో కార్యాలయం అవరణ లో తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మాణం వద్ద ప్రజా యుద్ద నౌక గద్దర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా షాద్ నగర్ ఎమ్మెల్యే విర్ల పల్లి శంకర్ హాజరై గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన ఆట పాటలతో ప్రజలను చైతన్యం చేసి తుది శ్వాస వరకు అణగారిన వర్గాల కోసమే పాటుపడి, తన పాటతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప ప్రజా గాయకుడు విప్లవ కవి,ప్రజాయుద్ధ నౌక గద్దర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత తాండ్ర కాశీనాథ్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, ,మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకట్ రాంరెడ్డి,కాంగ్రెస్ నేతలు బాధేపల్లి సిద్దార్థ, ఆశన్న గౌడ్, సోలిపుర్ శ్రీశైలంగౌడ్ ,,ఉద్యమ కారుల వెల్ఫేర్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జేఏసీ నేతలు అర్జున్ కుమార్, టెలిఫోన్ వెంకటయ్య, నేతలు, తదితరులు పాల్గొన్నారు.