31-01-2026 01:19:00 PM
దేవరకొండ: (విజయక్రాంతి): పీఏ పల్లి మండలంలోని శనివారం ఎల్లాపురం (పెద్దగట్టు) గ్రామంలో 2 కోట్ల 50లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన 33/11కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సబ్‌స్టేషన్ ప్రారంభం కావడంతో వ్యవసాయం,గృహోపయోగం, చిన్నపాటి పరిశ్రమలు అన్నీ దీనివల్ల లాభపడతాయి.
విద్యుత్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది శాశ్వత పరిష్కారం కానుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి సక్రమంగా మౌలిక వసతులు అందించడానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సి ఈ బాలస్వామి,డిఈ బాల్య, ఏడిఈ సైదులు,కాంట్రాక్షన్ ఏడి దీప్తి, ఏఈ దేవుజీ నాయక్, సర్పంచ్ రమావత్ పద్మ నారాయణ నాయక్, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.