calender_icon.png 31 January, 2026 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె బాట పట్టిన విద్యుత్ శాఖ అధికారులు

31-01-2026 01:15:05 PM

షాద్‌నగర్,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాలలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు పల్లె బాట పట్టారు. శనివారం  ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామంలో విద్యుత్ శాఖ డిఈ శ్యామ్ సుందర్ రెడ్డి తన అధికారులు, సిబ్బందితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎంసి ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్ ఎర్రోళ్ల అశోక్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ శాఖ అధికారులు డిఈ శ్యాంసుందర్, ఏఈ షణ్ముఖ రెడ్డి సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డిఈ శ్యాంసుందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోనూ, పట్టణ ప్రాంతాలలోనూ నిరంతరంగా సంచరిస్తూ విద్యుత్ సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నామని వెల్లడించారు.