calender_icon.png 31 January, 2026 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో చక్కని ఆరోగ్యం

31-01-2026 01:20:28 PM

జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవపూర్ మండల కేంద్రంలో క్రీడా స్ఫూర్తి ప్రధాత ధ్యాన్ చంద్ జయంతి ని పురస్కరించుకొని రెండో విడత సీఎం కప్ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మండల ఎంపిడిఓ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన జ్యోతి ప్రజ్వలన చేసారు.అనంతరం స్థానిక ఎస్ ఐ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో పిల్లలకు క్రీడల్లో ప్రతిభ ఉన్నా రాష్ట్ర స్థాయి వరకు ఎలా వెళ్లాలో తెలియక పాఠశాల స్థాయిలోనే ఆగిపోతారాని అలాంటి వారికీ సీఎం కప్ గొప్ప అవకాశం అన్నారు. క్రీడలు ఆడుతూ చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు అన్నారు.  ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నిర్మల, ఎంఈఓ సైదులు,సర్పంచ్ లు శ్రీనివాస్ గౌడ్, ఓం ప్రకాష్, హేమ బాలమ్మ సురేష్,విద్యదార్,మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ స్లివరాజు,పి యి టి ఉపాధ్యాయులు ఏలేందేర్,అనంత రాములు చారీ,పంచాయతీ కార్యదర్శులు,నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.