calender_icon.png 31 January, 2026 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్దిమడుగులో సెల్ టవర్ సేవలు ప్రారంభం

31-01-2026 01:21:53 PM

ప్రారంభించిన ఎంపీ మల్లురవి ఎమ్మెల్యే వంశీకృష్ణ 

ఆంజనేయునికి ప్రజాప్రతినిధుల ప్రత్యేక పూజలు 

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు గ్రామంలో శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందిన స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, పార్లమెంట్ సభ్యులు మల్లు రవి. అచ్చంపేట నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతంలో సెల్ టవర్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ చర్వతో సెల్ టవర్ సేవలు అక్కడి ప్రజలు అందుకోవాలని ఉద్దేశంతో ఈరోజు పార్లమెంటు సభ్యులు మల్లు రవి గారితో కలిసి సెల్ టవర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఏజెన్సీ ప్రజలు సెల్ టవర్ సేవలు ప్రారంభించగానే ఎక్కడలేని ఆనందంతో ప్రజలు సంతోషిస్తున్నారు. గ్రామాలలో ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కరించే విధంగా ముందుకు పోతానని ఎమ్మెల్యే అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం పదర, అమ్రాబాద్ మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ,ఎంపీ మల్లు రవి,ఆయా గ్రామాల ప్రతినిధులు ప్రజలు.