20-08-2025 11:14:47 AM
హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ సేవలను స్మరిస్తూ జరుపుకునే “సద్భావనా దివస్” సందర్భంగా దేశ వ్యాప్తంగా శాంతి, సామరస్యం, సమానత్వం, ఐక్యత సందేశాన్ని చాటుదామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ జయంతిని(Rajiv Gandhi birth anniversary) పురస్కరించుకుని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) నివాళులు అర్పించారు. ''భారతదేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన దూరదృష్టి నాయకుడు, దేశభవిష్యత్తు కోసం తన జీవితాన్ని అర్పించిన సాహసి, నేటి భారత ఐటి, ఆధునికత, అభివృద్ధి వెనుక నిలిచిన ప్రతిభ, పటిమల ప్రతీక.. మార్పు కోసం కలగన్న భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి జయంతి నివాళులు'' అంటూ భట్టి విక్రమార్క ఎక్స్ లో పోస్టు చేశారు.