24 April, 2026 | 5:05 PM

దుశ్చర్ల సత్యనారాయణపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి వాకబు

24-04-2026 03:48 PM

హైదరాబాద్: పర్యావరణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ(Dusharla Satyanarayana) ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) వాకబు చేశారు.  ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఓఎస్డీ వేముల శ్రీనివాసులు దుశ్చర్లతో మాట్లాడారు. వెంటనే వారికి పూర్తి ప్రభుత్వ ఖర్చులతో నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం చేయించడానికి ఏర్పాట్లు చేశారు.

సూర్యాపేటలో ప్రకృతి ప్రేమికుడు సత్యానారాయణపై దాడి జరిగింది. దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. నిమ్స్ లో వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య మీద దశాబ్దాల పాటు పోరాటం చేసిన యోధుడు దుశ్చర్ల సత్యనారాయణ మీద జరిగిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. దాడిచేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, దుశ్చర్లకి మెరుగైన వైద్య సహాయం అందించాలని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.