calender_icon.png 5 December, 2024 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతన్నల కోణంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు

10-07-2024 07:22:52 PM

హైదరాబాద్: జాతీయ రహదారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్లు పాల్గొన్నారు. రహదారులకు భూసేకరణ ఎందుకు జాప్యమవుతోందని సీఎం కలెక్టర్లను ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్, మార్కెట్ ధరల మద్య భారీ వ్యత్యాసంతో రైతులు ముందుకు రావట్లేదని కలెక్టర్లు ముఖ్యమంత్రి తెలిపారు. భూసేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

నిబంధనల ప్రకారం రైతులకు ఎక్కువ పరిహారం దక్కేలా చూడాలని సీఎం ఆదేశించారు. భూములను కోల్పోతున్న రైతులను పిలిచి కలెక్టర్లు మాట్లాడాలని సూచించారు. తరతరాలు భూమినే నమ్ముకున్న రైతులకు అన్యాయం జరగొద్దని, పరిహారం విషయంలో రాజీ పడొద్దని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఆర్ఆర్ఆర్ దక్షిణ, ఉత్తర భాగాలకు ఒకే నంబర్ వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్ హెచ్ఏఐ త్రైపాక్షిక ఒప్పందానికి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విజయవాడ-నాగపూర్ కారిడార్ భూ సేకరణ వేగవంతం చేయాలన్నారు. హైదరాబాద్ – మన్నెగూడ రహదారి పనులు త్వరగా ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి హైదరాబాద్-విజయవాడ ఆరు లేన్ల రహదారి విస్తరణ పనులు రెండు నెలల్లో ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమీక్షలోసీఎస్ శాంతి కుమారి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.