19-09-2025 12:37:03 PM
తనిఖీల్లో పాల్గొన్న హుజురాబాద్ ఏసిపి మాధవి
హుజురాబాద్,(విజయక్రాంతి): సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కార్డెన్ సెర్చ్, కమ్యూనిటీ ప్రోగ్రాం హుజురాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కమ్యూనిటీ ప్రోగ్రాంలో భాగంగా గ్రామంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ధ్రువపత్రాలు లేని 52 వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఏసీపీ మాధవి మాట్లాడుతూ.. గ్రామాల్లో యువత సోదర భావంతో మెదులుతూ చదువే లక్ష్యంగా ముందుకు సాగి, కలలను సాకారం చేసుకోవాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేశవపట్నం ఎస్ఐ కట్కూరి శేఖర్ రెడ్డి, డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.