19-09-2025 12:32:58 PM
ఆశ్రమం మాదే అంటున్న ఇరువర్గాలు
దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు
నల్లగొండ, (విజయక్రాంతి): నల్లగొండ పట్టణంలోని(Nalgonda town) గంధం వారి గూడెంలో 1980 లో భక్తుల విరాళంతో నిర్మించిన ఓంకార స్వరూపిణి శ్రీ శ్రీ జగద్గురు బాలయోగి మాణికేశ్వరి మాత ఆశ్రమం వివాదంలో పడింది. నాన్నగారు ఏర్పాటుచేసిన ఆశ్రమంలోమాకి మమ్మల్ని రాకుండా అడ్డుకుంటున్నారని ఆశ్రమంపై యాజమాన్య హక్కుల ప్రకారం తమకే చెందుతాయని తాను ఆశ్రమానికి వారసత్వ పీఠాధిపతినని హైదరాబాద్ కు చెందిన కందాడి జగ్జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఈ భూములను తన పేరున అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కుట్రలు చేస్తున్నాడని గతంలో ఆశ్రమాన్ని నిర్వహించి మరణించిన దోమలపల్లి లక్ష్మీ నరసింహారావు కుటుంబ సభ్యులు గత రెండు రోజుల నుండి ఆశ్రమం ఎదుట ఆందోళన చేస్తున్నారు.
ప్రజల సొమ్ముతో నిర్మించిన ఆశ్రమానికి వారికి ఎలాంటి సంబంధం లేదని ప్రస్తుతం ఆశ్రమం నిర్వహిస్తున్న గంగాధర చారి చెబుతున్నారు. 15.24 ఎకరాల భూమిలో నెలకొల్పిన ఈ ఆశ్రమం యాజమాన్య హక్కులపై ఇప్పటికీ ఇరువర్గాలు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. జరుగుతున్న వివాదంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య జరుగుతున్న గొడవలకు ఆశ్రమం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వన్ టౌన్ సీఐ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.