calender_icon.png 19 September, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామచంద్రపురం డివిజన్‌లో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు

19-09-2025 12:41:31 PM

రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్(Ramachandrapuram division ) మందుముల శ్రీనివాస్ నగర్ కాలనీలోని శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్, ఆలయ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్, పురోహితులు బాలకృష్ణ పంతులు, గ్రామ పెద్దలు, అన్ని కులస్తుల పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ, దసరా, జమ్మి పూజ, రావణదహనకండ కార్యక్రమాల తేదీలను నిర్ణయించారు. అందరి అంగీకారంతో సెప్టెంబర్ 29న సాయంత్రం 5:30 గంటలకు బతుకమ్మ, అక్టోబర్ 2న సాయంత్రం 5:35 గంటలకు దసరా, జమ్మి పూజ, రావణదహనకండ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు, నాయకులు, అన్ని సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.