calender_icon.png 19 September, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్జాతీయ సదస్సులో పాల్గొనున్న సాయికృష్ణ

19-09-2025 12:39:42 PM

హనుమకొండ(విజయ క్రాంతి): కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University) జియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్. కే. సాయికృష్ణ ప్రతిష్టాత్మకమైన ఐఐటి మద్రాస్ వారు నిర్వహించిన హిమాలయన్ జియోలాజికల్ ఫీల్డ్ ట్రైనింగ్ కు  ఎంపిక కావడం జరిగింది. ఈ ఐఐటి మద్రాస్ వారు భారతదేశం మొత్తం మీదుగా 20 పరిశోధకులను ఈనెల 20వ తారీకు నుండి 24 తారీకు వరకు లడఖ్ లో జరిగే  ఫీల్డ్ ట్రైనింగ్ కు ఎంపిక చేశారు. డాక్టర్. సాయి కృష్ణ విభాగ అధిపతి అయిన ప్రొఫెసర్. ఆర్. మల్లికార్జున్ రెడ్డి సంరక్షణలో పీహెచ్డీ పొందినారు. ఆ తర్వాత అధ్యాపకునిగా సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా డాక్టర్. కే. సాయి కృష్ణ ఇంతకుముందు వివిధ దేశాలలో నిర్వహించిన 5 అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా విభాగాధిపతి ప్రొఫెసర్. ఆర్. మల్లికార్జున రెడ్డి మరియు టీచింగ్, పరిశోధక విద్యార్థులు, నాన్ టీచింగ్ స్టాఫ్ అభినందించారు.