calender_icon.png 18 January, 2026 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సింగ్ చేసిన వారికి విదేశాల్లో మంచి డిమాండ్

18-01-2026 02:15:33 PM

ఇంజినీరింగ్ కంటే... నర్సింగ్, మెడికల్ సైడ్ మంచి భవిషత్తు

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఆదివారం పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... పేద ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వృత్తి ధర్మంలో బాధ్యతతో వ్యవహరిస్తే ఎంతో మందిప్రాణాలు రక్షించిన వారవుతారని సూచించారు.

ఈరోజుల్లో ఇంజినీరింగ్ చదువుకున్న వారికంటే నర్సింగ్, మెడికల్ సైడు ప్రపంచలో ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నర్సింగ్ చేసిన వారికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నర్సింగ్ ఉద్యోగులను ఎంత మందినైనా నియమించుకునే దేశాలు చాలా ఉన్నాయని వివరించారు. జపాన్, జర్మనీ పంపించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుందని వెల్లడించారు. విదేశాలకు వెళ్తేందుకు అవసరమైన భాష నేర్పించేందుకు కార్యాచరణ తీసుకుంటామని తెలిపారు.