18-01-2026 01:55:33 PM
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటిస్తున్నారు. ఏదులాపూర్ మున్సిపాలిటీలో రూ. 362 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవం చేశారు. మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ పనులకు సీఎం, మంత్రులు శంకుస్థాపన చేశారు. కూసుమంచిలో రూ.45 కోట్లతో 100 పడకల ఆసుపత్రి, రూ. 108 కోట్లతో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ. 18 కోట్లతో నిర్మించిన మద్దులపల్లి మార్కెట్ యార్డు, నర్సింగ్ కాలేజీని సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.