calender_icon.png 18 January, 2026 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచులకు శిక్షణ తరగతులు

18-01-2026 04:01:10 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులకు సోమవారం నుంచి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్టు జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ తెలిపారు. నిర్మల్ బైంసా డివిజన్ పరిధిలోని సర్పంచ్లకు పంచాయతీరాజ్ చట్టం గ్రామ పరిపాలన విధులు సర్పంచ్ల బాధ్యత ఇతర అంశాలపై మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఒక్కొక్క బ్యాచ్ కు 50 మంది సర్పంచ్లను ఎంపిక చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గ్రామపంచాయతీలో అభివృద్ధికి ప్రభుత్వం ఆర్థిక ఫైనాన్స్ నిధులను వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని వివరించారు. ఆ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.