బండి భగీరథ్ కేసుపై సీఎం సీరియస్.. డీజీపీకి రేవంత్ ఆదేశం
హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన బండి భగీరథ్ కేసుపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేసులో ఆలస్యం జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మే 8న ఫిర్యాదు నమోదు అయినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని సీఎం, రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా డీజీపీ కేసు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన కారణంగా పోలీస్ సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని తెలిపారు. అయినప్పటికీ కేసు విచారణలో ఆలస్యం సహించబోమని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.
తెలంగాణ ఎడ్యుకేషన్ విజయక్రాంతి న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సీఎం డీజీపీకి ఆదేశించారు. త్వరితగతిన నిజాలు వెలికితీయాలని సూచించారు. “విచారణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు” అని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.






