11 May, 2026 | 3:43 PM

బండి భగీరథ్ కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలి

11-05-2026 02:29 PM

మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ 

దేవరకొండ,(విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో మూడు రోజులు గడిచినా అరెస్టు చేయకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆరోపించారు. సోమవారం దేవరకొండలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర పోలీస్ వ్యవస్థ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.మైనర్ బాలిక కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలంటే బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.