11 May, 2026 | 3:35 PM

ఆంక్షలు లేకుండా పంట కొనుగోలు చేపట్టాలి: మాజీ ఎంపీపీ

11-05-2026 02:16 PM

బోథ్,(విజయక్రాంతి): రైతులు పండించిన జొన్న మొక్కజొన్న పంటలతో పాటు ఇతర పంటలను ప్రభుత్వం ఆంక్షలు లేకుండా కొనుగోలు చేపట్టాలని మాజీ ఎంపీపీ బి ముత్యంరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఆంక్షలు విధించడం వల్ల రైతులు పండించిన పంట పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి విక్రయించలేకపోతున్నారన్నారు. రైతులు సాగు చేసిన పంటని ప్రభుత్వానికి విక్రయిస్తున్నారని అయితే ఆంక్షలు వల్ల పంటలు పండించడమా లేదా అనే ఆందోళన లో రైతులు పడుతున్నారన్నారు.

ప్రజా ప్రభుత్వం అంటూనే రైతులు పండించిన పూర్తి స్థాయిలో పంటను కొనుగోలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కూలీల కొరత పంట కోత యంత్రాల సిబ్బంది నడుమ రైతులు పంటను మార్కెట్కు తీసుకువస్తే ఇక్కడ గన్ని బ్యాగుల కొరత ఉందని వాపోయారు. ప్రభుత్వం రైతు పండించిన పంటను అంతా కొనుగోలు చేపట్టాలని గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి పంట రైతు విక్రయించుకున్న తర్వాత మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయని రైతు పండించి విక్రయించే సమయంలో మాత్రం ధరలు తక్కువ ఉంటున్నాయని ఆందోళన చెందారు. ప్రభుత్వం తీరు పట్ల రైతులు ఆగ్రహంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.