calender_icon.png 11 November, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

11-09-2024 02:07:34 PM

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం 4:30కి ఢిల్లీకి పయనం కానున్నారు. సీఎంతో పాటు పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ హస్తినకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. సీఎం, పీసీసీ చీఫ్‌ సోనియా గాంధీ అపాయింట్‌మెంట్‌ కోరారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు రేపు ఢిల్లీలో అందుబాటులో ఉండనున్నారు. అమెరికా పర్యటన ముగించుకుని రాహుల్ గాంధీ అర్ధరాత్రి ఢిల్లీకి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా క్యాబినేట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చర్చించే అవకాశముంది. రాజకీయ అంశాలపై కాంగ్రెస్ ముఖ్యులతో రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.