calender_icon.png 9 December, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం

09-12-2025 11:02:58 AM

హైదరాబాద్: తెలంగాణ(Telangana)రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఫ్యూచర్ సిటీ ప్రాంగణం నుంచి వర్చువల్‌గా ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ, ఒక్కొక్కటి 18 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాలు నిర్మించారు. రూ. 5.8 కోట్లతో 33 కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... 2009 డిసెంబర్ 9 తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఆరు దశాబ్దాల ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. 2004 ఎన్నికల్లో కరీంనగర్ వేదికగా సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు... ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ(Telangana Thalli statue) జరగడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరించామన్నారు. తెలంగాణ తల్లిని తలుచుకుని పనులు మొదలుపెట్టేందుకే విగ్రహాలు ఆవిష్కరించామని సీఎం సూచించారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ ఆనాడు యూపీఏ ప్రభుత్వం(UPA Government) నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ గుర్తుచేశారు. అందుకే ఈ రోజు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా నిర్ణయించామన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్ గా మారామని సీఎ వివరించారు.