09-12-2025 10:39:46 AM
హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) రెండో రోజు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా సీఎం రేవంత్ కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను(Telangana Thalli statue) ఆవిష్కరిస్తారు. మంగళవారం నాడు 20కిపైగా సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఆనంద్ మహీంద్రాతో ఈవీ, రూరల్ ఎంటర్ ప్రైజెస్ రంగాలపై చర్చించనున్నారు. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు. రాత్రి 7 గంటలకు గిన్నిస్ రికార్డ్ డ్రోన్ షో ఏర్పాటు చేశారు. నేటి సమ్మిట్ లో రూ. లక్ష కోట్లకుపైగా ఒప్పందాలు జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిన్న ఒక్క రోజే రూ. 3,97,500 కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.