19-09-2025 01:05:11 AM
-తగ్గిన శబరిమల ఆలయ విగ్రహాల బంగారు తాపడాల బరువు
-తీవ్రంగా పరిగణించిన కేరళ హైకోర్టు
-విజిలెన్స్ కమిటీ దర్యాప్తు చేపట్టాలన్న కోర్టు
-మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం
తిరువనంతపురం, సెప్టెంబర్ 18: ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ఆధీనంలో ఉన్న శబరిమల ఆలయంలోని ద్వారపాలక విగ్రహాలపై బంగారు తాపడాల బరువు 4.5 కిలోల మేర తగ్గడంతో కేరళ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. జస్టిస్ రా జా విజయరాఘవన్, జస్టిస్ కేవీ జయకుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీని పై విచారణ జరిపి.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. గర్భగుడి ముందు ద్వారపాలక విగ్రహాలపై ఉన్న బంగారు తాపడాలను మరమ్మతుల కోసం 2019లో తొలగించారు.
ఆ సమయంలో ఆ తాపడాల బరువు 42.8 కేజీలు ఉన్నట్టు రికార్డుల్లో పేర్కొన్నారు. వాటిని సరి చేయించి, కొత్త తాప డాలను అందిస్తానని ఉన్నికృష్ణన్ అనే దాత వాటిని తీసుకెళ్లి చెన్నైలో ఓ సంస్థకు ఇచ్చా రు. ఆ తాపడాలను తమ వద్దకు తీసుకొచ్చినపుడు కేవలం 38.28 కిలోలు మాత్రమే ఉన్నాయని చెన్నై కంపెనీ తెలిపింది. ‘బంగారం తగ్గుదల అనేది ఎటూ వివరించలేని విధంగా ఉందని, దీనిపై సమగ్ర విచారణ అవసరం’ అని కోర్టు అభిప్రాయపడింది. 1999లో ఈ బంగారు తాపడాలను విగ్రహాలకు అమర్చారు.
40 సంవత్సరాల గ్యారం టీతో ఆ తాపడాలు తయారయ్యాయి. 2019లో ఎవరికీ సరైన సమాచారం ఇవ్వకుండా టీడీబీ ఈ తాపడాలను మరమ్మ తుల కోసం ఇచ్చింది. విగ్రహాల నుంచి తాపడాలను తొలగించిన నెల రోజుల తర్వా త వాటిని చెన్నైలోని కంపెనీకి అందించారు. ఇలా ఉన్నట్టుండి తాపడాల బరువు తగ్గడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తరుగుదల పూత తగ్గడం వల్లే అని అభిప్రాయపడింది. దాతను కూడా కోర్టు అనుమానించింది.
దాత వాటి స్థానం లో మరో తాపడాల సెట్‌ను కంపెనీకి ఇచ్చే అవకాశం కూడా ఉందని పేర్కొంది. కూలంకషంగా తెలుసుకునేందుకు విజిలెన్స్ కమిటీ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపి.. విచారణ రిపోర్టును మూడు వారాల్లో అందించాలని టీడీబీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఎస్పీలను కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచా రణను సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది.