calender_icon.png 19 September, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జెండా పాతేదెవరు?

19-09-2025 12:47:13 AM

రాజకీయ పార్టీలకు సవాలుగా మారిన జూబ్లీహిల్స్

  1. వ్యూహ ప్రతివ్యూహలకు పదును సిట్టింగ్‌ను కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్ యాక్షన్ ప్లాన్ 
  2. ప్రచారంలో గులాబీ దళం ముందంజ 
  3. ‘హస్త’గతం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ 
  4. పట్టు సాధించాలనే ఆలోచనతో బీజేపీ

* జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఆ నియోజకవర్గంలో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్, ప్రతి పక్ష బీఆర్‌ఎస్, బీజేపీ రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. సిట్టింగ్ సీటును నిలుపుకునేందుకు బీఆర్‌ఎస్ ప్రత్యేక దృష్టిని సారించింది. ఇక అధికారంలో ఉన్నందున ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని నిరూపించుకోవాలని హస్తం పార్టీ పట్టుదలతో ఉండగా, జూబ్లీహిల్స్‌లో పట్టు సాధించాలని బీజేపీ కూడా ప్రయత్నం చేస్తోంది.

ముస్లిం మైనార్టీల ఓట్లపైన ఆధారపడి ఉన్న ఎంఐఎం పార్టీ ఇక్కడ పోటీ చేస్తుందా..? లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉండటంతో.. వారి ఓట్లు ఎటువైపు మళ్లుతాయనేది చర్చనీయాంశంగా మారింది.

బీఆర్‌ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీత పోటీ చేస్తారనే సంకేతం ఇవ్వగా, కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎక్కువ మంది ఆశావాహులు ఉండటంతో టికెట్లు ఎవరికి దక్కుతాయనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగిన గులాబీ నేతలు సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ పార్టీ చాపకింద నీరులా ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టింది.

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను అప్రమత్తం చేయడంలో బీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ నే.. గతంలో బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. అధికార కాంగ్రెస్‌కు ఝలక్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు.

జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపినాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవల ఆయన మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్య మైంది. వచ్చే ఉపఎన్నికలో ఆ స్థానం నుంచి మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను బీఆర్‌ఎస్ బరిలోకి దింపనున్నదనే సంకేతాలు వచ్చాయి. ఒక వైపు సెంటిమెంట్, మరోవైపు కమ్మ సామాజికవర్గం, సెటిలర్ల ఓట్లు తమకే పడుతాయనే గట్టి నమ్మకంతో బీఆర్‌ఎస్ నేతలు ముందుకెళ్తున్నారు.

అంతేకాకుండా మాగంటి గోపి నాథ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధ్దితో పాటు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి చూపిన చొరవ కలిసి వస్తుం దనే అభిప్రాయంతో బీఆర్‌ఎస్ నేతలున్నారు. ఇక నియోజకవర్గంలో ఓటు పోల రైజేషన్ ఎలా చేయాలనేదానిపై బీఆర్‌ఎస్‌కున్న అనుభవం కలిసి వస్తుందనే ధీమాతో గులాబీ నేతలున్నారు. జూబ్లీహిల్స్‌లో రైతు రుణమాఫీ, రైతు భరోసాతో పాటు ఇతర సంక్షేమ పథకాల ప్రచారం పని చేయదని చెబుతున్నారు. 

ఇక అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ను హస్తగతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నది. ఈ  నియోజకవర్గానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్‌తో పాటు ప్రతి డివిజన్‌కు ము గ్గుర చొప్పున వివిధ కార్పొరేషన్ల  చైర్మన్లు, పార్టీ నాయకులకు  ఇన్‌చార్జులుగా నియమించింది. అయితే  ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా 

 పట్టులేకపోవడంతో పాటు అభ్యర్థి ఎవరనేది స్పష్టత కరువైంది. కాంగ్రెస్ టికెట్ చా లా మంది ఆశిస్తుండగా, బీసీ నినాదంతోనే ముందుకు వెళ్లాలనే ఆలోచన బలంగా కనిపిస్తున్నది. బీసీ సామాజికవర్గం నుంచి నవీన్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రా మ్మోహన్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మురళీగౌడ్‌తో పాటు మరి కొం దరు టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఇన్‌చార్జ్‌లుగా ఉన్న మంత్రులు, కార్పోరేషన్ చైర్మన్లు మాత్రం క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా సమీక్షలు, సమావేశాలకే పరిమితమయ్యారనే చర్చ జరుగుతోంది.

బీసీ నినాదం, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసి.. అక్కడి నుంచి తప్పించారు. దీంతో ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌కు బదలాయింపు అవుతా యా..? బీఆర్‌ఎస్‌కు మొగ్గు చూపుతారా..? అని హస్తం పార్టీ నాయకుల్లో భయం నెలకొన్నది. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూ డా జూబ్లీహిల్స్‌లో విజయం సాధించకపోతే ప్రభుత్వంపై వ్యతిరేక ఉందనే ప్రచారంతో పాటు వచ్చే గ్రేటర్ హైదరాబాద్, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందనే భయం అధికార పార్టీలో నెలకొన్నది.

అందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  మూడురోజుల క్రితమే జూబ్లీహిల్స్ ని యోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా మంత్రులు, కార్పోరేషన్ చైర్మన్లు, పార్టీ నేతల సమావేశం నిర్వహించారనే చర్చ జరుగుతోంది. కమ్మ సామాజిక వర్గం ఓట్ల కోసం మంత్రి తుమ్మలను, బీసీ ఓట్ల కోసం మంత్రి పొన్నం ప్రభా కర్‌ను, దళిత సామాజిక వర్గం ఓట్ల కోసం వివేక్‌ను నియమించినా.. ఏ మేరకు ఫలితం ఇస్తుందనేని వేచిచూడాల్సి ఉంది.

అయితే మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ పేరుతో వెలిసిన పోస్టర్లు కాంగ్రెస్‌ను కలవరపెడుతున్నాయి.  ఇక బీజేపీ పార్టీకి కూడా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సవాల్‌గానే మారనుంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని చెప్పడంతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతిని ధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానానికే పరిమితమైంది.

ఆ ఎన్నికల్లో లంకల దీపక్‌రెడ్డి పోటీ చేశారు.  ఇప్పు డు మరోసారి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అయితే బీజేపీ హిం దూ నినాదం తో పాటు ప్రధాని మోదీ హవాతో బయటపడాలనే ఆలోచనతో ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదనేది బీజేపీ వర్గాలే చర్చించు కుంటున్నాయి. హైడ్రాతో పేదలకు నష్టం జరుగుతున్నదని ప్రజలకు వివరించే ఆలోచనలో బీజేపీ ఉంది. 

ఏకగ్రీవానికి ఛాన్స్.. 

గతంలో ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే.. అక్కడ ఇతర పార్టీలు పోటీకి పెట్టేవికావు. మరణించిన వారి వారసులు బరిలోకి దిగితే ఏకగ్రీవంగా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే  మాగంటి గోపినాథ్ వారసులు బరిలోకి దిగుతున్నందున.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  ప్రత్యేక చొరువ తీసుకుని ఏకగ్రీవం చేయడానికి ముందుకొస్తే బాగుంటుందని, ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుందనే  అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అభ్యర్థిని పార్టీ పరంగా కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపితే బాగుంటుందని చర్చ జరుగుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నో సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం, పాలనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. అంతే కాకుండా ఉపఎన్నికతో అన్ని పార్టీలకు  దాదాపు రూ. 300 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు లెక్కలు వేస్తున్నారు.

ఈ సందర్భంగా గతంలో మునుగోడు ఉప ఎన్నికను ఉదహరిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక దేశంలో అత్యంత కాస్ట్లీఎన్నికగా పేరుతెచ్చుకుంది. అప్పుడు ప్రభుత్వం, పార్టీలతో పాటు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలన్ని అక్కడనే దృష్టి పెట్టాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా అత్యంత ఖరీదుగా మారే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.