calender_icon.png 11 November, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎఫ్‌టిఎల్‌లోని భవనాలను కూల్చివేస్తాం: సీఎం రేవంత్

11-09-2024 01:11:26 PM

ఈ ఏడాది 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం  

డ్రగ్స్ పై ఉక్కు పాదం 

22 లక్షల మందికి రుణమాఫీ చేశాం 

పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరెడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి 

రాజేంద్రనగర్ : తెలంగాణ రాష్ట్రంలో 22 లక్షల మంది రైతుల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో హైడ్రాను తీసుకొచ్చిన నేపథ్యంలో ఎఫ్‌టిఎల్‌లోని భవనాలను పూర్తిగా కూల్చివేస్తామని, అది నా బాధ్యతని ఆయన తెలిపారు. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోలీస్ అకాడమీలో నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఎస్పీఎస్సీ ని పూర్తిగా ప్రక్షాళన చేశామని తెలిపారు. నిరుద్యోగ యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యోగాలు సాధించిన యువత బాధ్యతయుతంగా మెలగాలని సూచించారు.

గతంలో హిమాయత్ నగర్ గండిపేట జలాశయాల నుంచి నగరానికి తాగునీరు అందించే వారన్నారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు జెళ్ళ ఆశయాల ఎఫ్డిఎల్ పరిధిలో కొందరు బడాబాబులు ఫామ్ హౌస్ లో నిర్మించుకొని జలాశయాల్లోకి డ్రైనేజీ నీరు వదులుతున్నారన్నారు. చెరువుల ఆక్రమణతోనే వరదలు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సైలుగా ఉద్యోగాల్లో చేరిన వారు డ్రగ్స్ నిర్మూలనకు తమ వంతు కృషి చేయాలని తెలిపారు. కొందరు విచ్చలవిడిగా డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారని వారి భరతం పడతామని ఈ సందర్భంగా సీఎం హెచ్చరించారు. అనంతరం క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తో కలిసి కొద్దిసేపు సెటిల్ ఆడారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.