calender_icon.png 21 August, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ గీత దాటితే ఊరుకోను.. ఎమ్మెల్యేకు సీఎం హెచ్చరిక

15-04-2025 03:25:25 PM

మంత్రివర్గ విస్తరణలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అధ్యక్షతన మంగళవారం నాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం(Congress Legislature Party meeting) జరిగింది. సీఎల్సీ సమావేశంలో నాలుగు ముఖ్యాంశాలపై ప్రధానంగా చర్చించున్నారు. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ-ఎస్టీ వర్గీకరణపై చర్చించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. సీఎల్సీ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారని సూచించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువని తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. ఎంపీ చామల కిరణ్‌కి సీఎం రేవంత్‌రెడ్డి క్లాస్‌ ఇచ్చినట్లు సమాచారం. రోజుకొకరిని మంత్రిగా నువ్వే ప్రకటిస్తున్నావు.. ఇది మంచి పద్ధతి కాదు.. అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుందన్నారు. మంత్రులుగా ఎవరిని ఎంపిక చేయాలనేది హైకమాండ్‌ చూసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదని మందలించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్ లు పాల్గొన్నారు.