21-08-2025 10:08:01 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే(Former MLA Hanmanth Shinde) గురువారం కౌలాస్ ప్రాజెక్టును స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నప్పుడు ముందస్తుగా హెచ్చరికలు, గ్రామాలలో చాటింపులు, చేయకుండా అర్ధరాత్రి పూట నీటిని విడుదల చేయడం వలన కోట్లాది రూపాయల వంట నష్టం జరిగిందని అన్నారు. దీనికి బాధ్యులు ఎవరు అని ప్రాజెక్ట్ అధికారులకు మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. రాబోయే రోజులలో ఇటువంటి తప్పిదాలు చేయకుండా ఎవరి గురించే వేచి ఉండడం వారు ఆదేశిస్తేనే తప్ప నీటిని విడుదల చేయడం బాగుండదని సాంకేతికంగా పరంగా పరిజ్ఞానం కలిగిన వారు మీరు ఉండగా మీ ద్వారానే ప్రజలను అప్రమత్తం చేసి విడుదల చేయాలని ప్రాజెక్ట్ అధికారులకు తెలిపారు. జరిగిన పంట నష్టం కు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ రైతులందరికీ ఆర్థిక సాయం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.