calender_icon.png 22 August, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

21-08-2025 10:18:31 PM

జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి(District Additional Collector Deepak Tiwari) అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జూమ్ మీటింగ్ ద్వారా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఎపిఓ లు, ఎపిఎం లతో జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కొనసాగుతున్న సంక్షేమ అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో చేపట్టిన ఉపాధి హామీ పనుల జాతర, ఉల్లాస్ ద్వారా వయోజనులకు విద్య, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, వైద్య ఆరోగ్య సేవలు, ఉపాధి హామీ పనులు, వనమహోత్సవం, భారీ వర్షాల వలన దెబ్బతిన్న రహదారుల నిర్మాణం, పారిశుద్ధ్యం, పంచాయతీ కార్యదర్శుల హాజరు, మండల పంచాయతీ అధికారుల పర్యవేక్షణ, పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ నమోదుపై అధికారులతో సమీక్షించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, వన మహోత్సవం కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాన్ని త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భారీ వర్షాల వల్ల గ్రామాలలో విష జ్వరాలు, ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది గ్రామాలలో పర్యటించి శిబిరాలు నిర్వహించాలని, అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, గ్రామాలు, రహదారులు, మురుగు కాలువలలో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులు వెంటనే మరమ్మత్తులు చేపట్టి ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు హాజరుపై మండల పంచాయతీ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న సంక్షేమ అభివృద్ధి పనులు నిర్ణిత గడువులోగా పూర్తిచేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.