21-08-2025 10:20:27 PM
చండూరు (విజయక్రాంతి): చండూరు మండల(Chandur Mandal) పరిధిలోని నేర్మట గ్రామంలో మైసమ్మ గుడికి బోనాల సందర్భంగా ఎల్ఈడి లైట్లను నేర్మట గ్రామానికి చెందిన బొమ్మరగోని కైలాప్ తన సొంత డబ్బులతో లైట్లను ఆయన ఆ గ్రామానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజ సేవ చేయడంలో చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అనంతరం మైసమ్మ గుడికి సహాయం చేసినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బందిఈరటి శ్రీశైలం, నాగిళ్ళ లక్ష్మణ్,గ్రామ ప్రజలు నారాపాక అంజి, బిక్షం, శంకర్, మహేష్, కట్ట వెంకన్న తదితరులు పాల్గొన్నారు.