థామస్ కప్ సెమీస్‌లో భారత్
పతకం ఖాయం చేసిన పురుషుల జట్టు
డెన్మార్క్ , మే 1 : డెన్మార్క్ వేదికగా జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక థామస్ కప్ 2026 పో టీల్లో భారత బ్యాడ్మింటన్ పురుషుల జట్టు పతకం ఖాయం చేసుకుంది. తాజాగా క్వార్టర్ ఫైనల్లో పటిష్టమైన చైనీస్ తైపితో భారత్ తలపడింది. ఇందులో వరుసగా 3 సెట్లలో గెలి చి.. 3 తేడాతో ఘన విజయం సాధించింది. రెండో సింగిల్స్‌లో భారత క్రీడాకారుడు ఆయుశ్ శెట్టి.. ప్రస్తుత ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ లిన్ చున్-యిపై 21- 21 తేడా తో గెలుపొందాడు.
అంతకు ముందు జరిగిన సింగిల్స్‌లో లక్ష్య సేన్, డబుల్స్‌లో సాత్వి క్ సాయిరాజ్- శెట్టి కూడా గెలవడంతో భారత్ ఈ టైలో పూర్తిగా ఆధిపత్యం చాటుతూ ప్రత్యర్థికి ఏ అవకాశమూ ఇవ్వకుండా విజయం సాధించింది. ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే టైను క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు సెమీఫైనల్లో భారత్.. క్వార్ట ర్ ఫైనల్ 2లో తలపడే ఫ్రాన్స్-జపాన్ మ్యాచ్ విజేతతో తలపడనుంది. ప్రస్తుత ఫామ్ చూ స్తే భారత్ ఫైనల్‌కు చేరే అవకాశాలున్నాయి. సెమీఫైనల్‌లో ఓడినా పతకం దక్కుతుంది.






