07-08-2025 09:29:08 AM
హైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవం(National Handloom Day) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేనేతలకు, నేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మానవ నాగరికత ప్రగతిలో చేనేతకు విశిష్టమైన స్థానం ఉందని, ప్రజా ప్రభుత్వం చేనేత పునరుజ్జీవం కోసం, చేనేత కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం పని చేస్తోందని ఒక సందేశంలో అన్నారు. చేనేత కార్మికుల పాత బకాయిలు విడుదల చేయడంతో పాటు, లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలు మాఫీ చేయడం జరిగిందని చెప్పారు. చేనేత కార్మికుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ చేనేత అభయ హస్తం పథకం, తెలంగాణ నేతన్న పొదుపు, నేతన్న బీమా, తెలంగాణ నేతన్నకు భరోసా వంటి వినూత్న కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.