జాతీయ పార్టీలకు బీఆర్ఎస్ ముచ్చెమటలు పట్టించింది: కేటీఆర్
రాజన్న సిరిసిల్ల: రైతు భరోసా వేయనందకు రైతులు ఆగ్రహంతో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. సిరిసిల్ల లో బీఆర్ఎస్ నేతలు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రుణమాఫీ విషయంలో మోసం చేశారని రైతులు ఆగ్రహంతో ఉన్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలాచారని ఆయన పేర్కొన్నారు. అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. మహిళలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కోపంతో ఉన్నారు.. నెలకు రూ. 2500 ఇవ్వలేదని మహిళలు కాంగ్రెస్ పై కోపంతో ఉన్నారని తెలిపారు. భారతీయ జనతా పార్టీపై కూడా ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. అందుకే ఈ సారి సగం సీట్లు బీసీ కులాలకు బీఆర్ఎస్ కేటాయించిందని స్పష్టం చేశారు. పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెరిగినందున మోడీపై కోపంతో ఉన్నారు. రెండు జాతీయ పార్టీలకు బీఆర్ఎస్ ముచ్చెమటలు పట్టించిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.




