22-09-2025 02:15:20 PM
తెలంగాణ మలిదశ ఉద్యమ నేత కూనూరు సంజయ్ దాస్ గౌడ్..
చిట్యాల (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులకు 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసి దసరా కానుకగా సీఎం రేవంత్ రెడ్డి అందజేయాలనీ తెలంగాణ మలి దశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ సోమవారం డిమాండ్ చేశారు. చిట్యాల మండలం తాళ్ల వెళ్ళాంల, గుండ్రంపల్లి, సుంకేనపల్లి గ్రామాల్లో తెలంగాణ మలిదశ ఉద్యమ కారులు జోగు అశోక్, బోడిగే ఆంజయ్య గౌడ్, జోగు లింగస్వామితో కలిసి పర్యటించి తెలంగాణ మలిదశ ఉద్యమ కారులను కలిసి వారి కుటుంబ ఆర్ధిక పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం గుండ్రంపల్లి గ్రామంలో విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు, మలి దశ ఉద్యమ కారులకు 250 గజాల ప్రభుత్వ స్థలం కల్పించి ఇల్లు మంజూరు చేయాలని, ఉద్యమకారులకు గౌరవంగా రాజకీయంగా గుర్తింపు ఇవ్వాలని కోరారు. అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమం సందర్భంగా మరణించిన వారి కుటుంబాలకు ఆదర్షమైన పెన్షన్ కల్పించాలని కోరారు. కానీ ఇవి ఇప్పటివరకు అన్నీ పూర్తిగా నెరవేరలేదనే ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారుల హక్కులు, ఆర్థిక భద్రత హామీలను స్పష్టమైన షెడ్యూల్‌తో ప్రణాళిక వేసి, హామీలపై పారదర్శక నిర్ణయo ప్రకటించాలన్నారు. ఉద్యమకారుల డేటా సేకరణ చేసి అర్హత ఆధారంగా వాటిని అమలు చేయాలని సంజయ్ దాస్ గౌడ్ డిమాండ్ చేశారు.