calender_icon.png 22 September, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సహాయం అందజేత

22-09-2025 02:27:23 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): ఇటీవల కురిసిన వర్షాల్లో ఇల్లు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన బోనగిరి సత్యనారాయణకు సోమవారం స్థానిక పాత బస్టాండ్ వాసవి క్లబ్ కార్యాలయంలో ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ రేణికుంట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సభ్యులు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి బాల సంతోష్, బెల్లంపల్లి అధ్యక్షులు సామ మహేష్, పూర్వాధ్యక్షులు శ్రీనివాస్, రీజన్ చైర్మన్ కేశెట్టి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.