22-09-2025 02:12:05 PM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం..
చిట్యాల (విజయక్రాంతి): శ్రీ దుర్గా మాత ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని సోమవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham) అన్నారు. శ్రీశ్రీశ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిట్యాల పట్టణంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారు మొదటి రోజు త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనం ఇవ్వగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం-పుష్ప దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరి జీవితంలో సంతోషం, ఆనందం, శ్రేయస్సు నిండాలని కోరుకుంటూ ప్రజలందరికీ దేవి శరన్నవరాత్రుల ప్రారంభ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, దుబ్బాక అమరేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మి నర్సింహా, పట్టణ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య,ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ ఎద్దుల పూరి కృష్ణ, మాజీ కౌన్సిలర్ బెల్లి సత్తయ్య, నాయకులు, కార్యకర్తలు, అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.