17-07-2025 01:12:19 AM
గజ్వేల్, జులై16: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని రిజర్వేషన్లపై స్పందించాలంటూ ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిసి ఎమ్మెల్యేలకు 50శాతం మంత్రి పదవులు ఇచ్చి సీఎం చిత్త శుద్ధి నిరూపించుకోవాలని మెదక్ ఎంపీ రఘనందన్ రావు అన్నారు.
బుధవారం గజ్వేల్ లో కొలుగూరు మాజీ సర్పంచ్ మల్లం రాజు సతీమణి మల్లం సుమతితోపాటు, గ్రామానికి చెందిన కాంగ్రెస్ టిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు ఎంపీ రఘునందన్ రావు సంవత్సరంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా
ఎంపీ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మత రిజర్వేషన్లకు ఎప్పుడూ ఒప్పుకోదన్నారు. కాంగ్రెస్ పార్టీలో అధిక సంఖ్యలో బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారని 50% మంత్రి పదవులు వారికి ఇచ్చి బీసీల పట్ల చిత్తశుద్ధిని సీఎం రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇండ్లపై ఇల్లు కట్టవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, పేదలకు కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తే, వాటిని కాంగ్రెస్ కార్యకర్తలకు పంచి పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ పై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, బిజెపిలో చేరితే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించవచ్చని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారన్నారు.
అందుకే ఇతను పార్టీల నుండి బిజెపిలో భారీగా చేరుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పై ప్రజల్లో విశ్వాసం పోయిందని బిజెపితోనే ప్రజలకు మేలు జరుగుతుందని గుర్తించారన్నారు. బిజెపిలో చేరిన వారిలో మాజీ ఎంపిటిసి, మాజీ ఉప సర్పంచ్ ,మాజీ వార్డ్ మెంబర్లు వివిధ కుల సంఘాలు ప్రజలు మొత్తం కలిసి 100 మంది చేరగా, వారికి ఎంపీ కండువాకప్పి పార్టీలో ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్, మండల శాఖ అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్, పట్టణ శాఖ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్, రాష్ట్ర నాయకులు ఏల్లు రాంరెడ్డి, నాయకులు నలగామ శ్రీనివాస్, ఏరుపుల వెంకటరమణ, సింగం సత్తయ్య, నేతలు నత్తి మల్లేశం, మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు ఉమా, గజ్వేల్, సాయిబాబా, మాజీ సర్పంచ్ బుద్ధ సత్యం, వంజరి రాజు, మన్నె శేఖర్ ,మండల ప్రధానకార్యదర్శి లు ఇప్ప స్వామి,బారు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.