17-07-2025 01:09:31 AM
పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ
సిద్దిపేట, జూలై 16 (విజయక్రాంతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 13 లోపు వికలాంగులకు పింఛన్లు పెంచాలని లేదంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ సవాల్ విసిరారు. సిద్దిపేట పట్టణంలోని మెట్రో గార్డెన్ లో నిర్వహించిన దివ్యాంగుల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందనీ మండి పడ్డారు.
19నెలలు గడిచిన రేవంత్ రెడ్డి పెంచుతామన్న పెన్షన్ పెంచలేదు. ప్రతినెల వేయి కోట్లు నష్ట పోయారన్నారు. పెన్షన్ పొందేది నూటికి 99శాతం పేదలేనని అన్నారు. రుణమాపి పై ప్రశ్నించే ప్రతిపక్షాలు పెండింగ్ పెన్షన్ గురించి ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో అన్ని పార్టీలు ఉండగా ఒక జాతి పార్టీ అయిన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ మాత్రమే ఎందుకు కోట్లడాలన్నారు.
రైతులకు రైతు భరోసా పేరిట డబ్బులు వేస్తున్న ప్రభుత్వం కౌలు రైతులకు ఎందుకు వేయడం లేదని నిలదీశారు. ఆరోగ్యశ్రీ కార్డు పేరిట ఏంఆర్పిఎస్ 10లక్షల రూపాయలు పేదలకు అందించిందన్నారు. తన పోరాటం వల్లనే ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందనీ, 2004లో కాంగ్రెస్ మేనిఫెస్టులో రూ.200 పెన్షన్ పెట్టింది. 2007లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేసి అప్పటి నుండి వికలాంగులతో అనుబంధం ఏర్పడిందనీ చెప్పారు.
ఆంధ్రాలో చంద్రబాబు హామీ మేరకు పెన్షన్ పెంచి ఇస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి పెన్షన్ పెంచి ఎందుకు ఇవ్వడం లేదు చెప్పాలనీ ప్రశ్నించారు. వృద్ధులకు వెయ్యి రూపాయల పెన్షన్ పెరగాలని రూ.10 లక్షల మందితో హైదారాబాద్ లో సభ ఏర్పాటు చేశామన్నారు. పదేండ్ల లో రూపాయి పెరగని పెన్షన్ ను వెయ్యి రూపాయలకు పెంచేలా చేసింది ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమేనాని చెప్పారు.
ఆకలి కేకల పోరాటం ఫలితమే 6కిలోల రేషన్ బియ్యం పంపిణీ అన్నారు. ఆగస్ట్ 13న వరకు పింఛన్ పెంచాలి లేదా రేవంత్ రెడ్డి రాజీనామా చేయడమా తేల్చుకోవాలని సవాల్ విసిరారు..ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి మంద కుమార్ మాదిగ, బీఆర్‌ఎస్ సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గ్ రాజనర్సు, పాల సాయి రాం,వికలాంగులు హక్కుల పోరాట సమితి నాయకులు దండు శంకర్,
ఎమ్మార్పీఎస్ నాయకులు మల్లిగారి యాదగిరి,చిట్టెల సంపత్, బొంగోని శ్రీశైలం,జింక యాదగిరి, పిడిశెట్టినారా యణ, అసర్ల రమేష్, సిద్దిపేట జిల్లా ఎమ్మార్పీఎస్, ఎఎస్పీ కోఇంచార్జి, పెర్కపర్శరాములు జిల్లా అధ్యక్షులు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ముక్కపల్లి రాజు, సుంచు రమేష్, మల్లేశం, లక్ష్మణ్ పాల్గొన్నారు.