26 August, 2026 | 4:53 AM

అనధికార నిర్మాణాలపై సీఎంసీ కఠిన చర్యలు

26-08-2026 01:47 AM

శేరిలింగంపల్లి, ఆగస్టు 25 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనధికార  నిర్మాణాలపై ఎన్ఫోర్స్మెంట్ యంత్రాంగం వేగం పెంచింది. కమిషనర్ ఆ దేశాలతో మూడు జోన్లలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి, మంగళవారం 17 అనధికార భవనాలను కూల్చివేశారు. శేరిలింగంపల్లి జో న్లో ఏడు, కూకట్పల్లి జోన్లో రెండు, కుత్బుల్లాపూర్ జోన్లో ఎనిమిది నిర్మాణాలు తొలగిం చారు. కూల్చివేతలతో పాటు 11 అనధికార నిర్మాణలకు నోటీసులు జారీ చేశారు.

మైకూర్ యాప్, ప్రజావాణి ఫిర్యాదులు, అధికారుల ప్రత్యక్ష తనిఖీల ద్వారా మొత్తం 54 అనధికార నిర్మాణాలను గుర్తించినట్లు సీఎంసీ వెల్లడించింది.అనధికార నిర్మాణాలను మొదటి దశలోనే గుర్తించి తక్షణ చర్యలు తీసుకునేలా టౌన్ ప్లానింగ్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు నిరంతరం సమన్వయంతో పని చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు.ప్రతిరోజూ క్షేత్రస్థాయి పర్యవేక్షణ కొనసాగించి, నిబంధనలు ఉల్లంఘించిన వాటిపై సకాలంలో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.భవన నిర్మాణ నిబంధనలను కఠినంగా అమలు చేయడం, ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం లక్ష్యంగా సీఎంసీ ఈ చర్యలను మూడు జోన్లలో కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు.