26 August, 2026 | 3:53 AM

రాజకీయ ఖైదీలను విడుదల చేయండి

26-08-2026 01:46 AM

ఇఫ్టు ప్రధాన కార్యదర్శి షేక్షావలి

జవహర్‌నగర్, ఆగస్టు 25 (విజయక్రాంతి): అప్రజాస్వామికంగా ఆదివాసీ, ప్రజాసంఘాలు, మేధావులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేసి రాజకీయ ఖైదీలుగా జైల్లో మగ్గుతున్న వారిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎంఎల్) చండ్రపుల్లారెడ్డి కేంద్ర కమిటీ కార్యదర్శి షేక్షావలి డిమాండ్ చేశారు.

జవహర్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలోసీపీఐ(ఎంఎల్) చండ్రపుల్లారెడ్డి కేంద్ర కమిటీ కార్యదర్శి షేక్షావలి ఆధ్వర్యంలో రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం  చేయాలని మంగళవారం వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా షేక్షావలి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో రాజ్యాంగం కల్పించిన ప్రజా సంక్షేమాన్ని, దేశ అభివృద్ధిని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని మండిపడ్డారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏళ్ళ తరబడి జైల్లో విచారణలు, బేయిల్లు లేకుండా ఏళ్ళ తరబడి ఉంటున్న వారిని చట్టబద్ధమైన చర్యలు తీసుకుకోని విడుదల చేయాలన్నారు. రాజకీయ ఖైదీల విడుదలకై ఈ నెల 29న ఇందిరా పార్కు వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలేషా, సావిత్రి, సునీత, చంద్రమౌళి, మోనార్ దుర్గాప్రసాద్, నర్సింహా, శివన్నారాయణ, అరుణ, వెంకటాచారి, యాకస్వామి, ప్రవీణ్, బాలు తదితరులు పాల్గొన్నారు.