calender_icon.png 4 July, 2025 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ ధాన్యం అప్పగింత ప్రక్రియ వేగవంతం చేయాలి

02-07-2025 12:00:00 AM

అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

కొత్తకోట జూలై 1: సీఎంఆర్ ధాన్యం అప్పగింత ప్రక్రియ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం కొత్తకోట మండలం మమ్మలపల్లిలోని రైతు ఆగ్రో ఇండస్ట్రీస్,కొత్తకోట మండలం శంకరెడ్డిపల్లి గ్రామంలోని కొత్తం ఇండస్ట్రీస్లను అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్ సివిల్ సప్లైస్ సి.ఎస్. జగన్మోహన్, అసి స్టెంట్ మేనేజర్ (సివిల్ సప్లైస్) బాలు నాయక్ తో కలిసి మిల్లులను తనిఖీలు చేశారు. సీఎంఆర్ డెలివరీల ప్రస్తుత స్థితిని పరిశీలించారు.

డెలివరీల ప్రక్రియను వేగవంతం చేసేందుకు మిల్లు యజమానులతో మాట్లాడి, డెలివరీలను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ధాన్యం నిల్వలు, మిల్లింగ్ సామర్థ్యం, డెలివరీలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. నిర్దేశిత సమ యం కంటే ముందే సీఎంఆర్ డెలివరీలను పూర్తి చేయాలని, అందుకు అవసరమైన అన్ని చర్య లు తీసుకోవాలని అధికారులకు, మిల్లు యజమానులకు సూచించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి, పౌర సరఫరాల శాఖకు అందజేయడం ఎంత ము ఖ్యమో వివరించారు. ఈ తనిఖీలలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.