calender_icon.png 2 July, 2025 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు

02-07-2025 12:00:00 AM

కలెక్టర్ హనుమంతరావు హెచ్చరిక 

యాదాద్రి భువనగిరి, జూలై 1 ( విజయ క్రాంతి ): లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని నిబంధనలు    అతిక్రమించిన వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేసి జరిమానా  విధించడం జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు హెచ్చరించారు.

మంగళవారం రోజు జిల్లా కలెక్టర్ గారి ఛాంబర్ లో నిర్వహించిన జిల్లా అప్రోప్రీయే ట్ అథారిటీ కమిటీ పిసిపి ఎన్డిటి చట్టము సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు1994 లో అమల్లోకి వచ్చింది అన్నారు.  జిల్లాలో ఉన్న అన్ని స్కానింగ్ కేంద్రాలు విధిగా నిర్దేశించిన రూల్స్ ప్రకారము నిర్వహించాలని తెలిపారు. 

నిబంధనలు అతిక్రమించినట్లయితే స్కానింగ్ సెంటర్ల యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయడం జరుగుతుందన్నారు.  చట్ట ప్రకారం డాక్టర్లు సిబ్బంది, నిర్వాహకులు ప్రత్యక్షంగా, కానీ పరోక్షంగా కాని చేసిన మొదటి తప్పుకు రూపాయలు పది వేలు జరిమానా, మూడు సoవంత్సరాలు జైలు శిక్ష  రెండవ సారి తిరిగి తప్పు చేస్తే ఐదు  సంవత్సరాలు జైలు శిక్ష 50 వేలు జరిమానా విధించబడుతుంది.

లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టము  నిబంధనలు ఉల్లంఘించిన స్కానింగ్ సెంటర్ల పై తీసుకోనున్న చర్యలపై, అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు..  లింగ నిర్ధారణ ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 8074261809  గల గోడ  పత్రిక ను ఆవిష్కరించారు. 

అనంతరం డాక్టర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేస్తూ  డాక్టర్స్ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు,అడిషనల్ డి సి పి లక్ష్మి నారాయణ, జిల్లా వైద్య అధికారి మనోహర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.